
ప్రజాశక్తి - కర్నూలు క్రైం : ఈ నెల 5 వ తేదీన (మంగళవారం) రాష్ట్ర ముఖ్యమంత్రి వై.ఎస్ జగన్ మోహన్ రెడ్డి కర్నూలు జిల్లా , ఆదోని పట్టణంలో పర్యటించనున్న నేపథ్యంలో సోమవారం ఆదోని ఒకటవ పట్టణ పోలీసుస్టేషన్ పరిధిలోని రెడ్డి ఫంక్షన్ హాల్లో బందోబస్తు నిమిత్తం విచ్చేసిన పోలీసు సిబ్బందికి ఎస్పి సిద్ధార్థ్ కౌశల్ పలు సూచనలు, సలహాలు చేశారు. ఆదోని పట్టణంలో రూట్, రూఫ్ - టాప్ ప్రాంతాలలో హెలిపాడ్, బహిరంగ సభ సమావేశ ప్రాంగణం, తదితర ప్రాంతాలలో బందోబస్తు విధులు నిర్వహించే పోలీసులు, స్పెషల్ పార్టీ పోలీసు బృందాలు, పోలీసు జాగీలాలు, బాంబ్ స్క్వాడ్ బందాలతో పోలీసులు అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు. ఇద్దరు అడిషనల్ ఎస్పీలు , ఆరుగురు డిఎస్పీలు, 40 మంది సిఐలు, 80 మంది ఎస్సైలు, 115 మంది ఎఎస్సైలు / హెడ్ కానిస్టేబుళ్ళు, 350 మంది కానిస్టేబుళ్ళు, 50 మంది మహిళా పోలీసులు, 100 మంది హోంగార్డులు, 04 సెక్షన్ల ఏ ఆర్ సిబ్బంది, 04 ప్లటూన్ల ఎపిఎస్పి సిబ్బంది, 11 స్పెషల్ పార్టీ బందాలను బందోబస్తు విధులకు కేటాయించామన్నారు. ఈ సమావేశంలో అడిషనల్ ఎస్పీ రమణ, డిఎస్పీలు వినోద్ కుమార్ , వెంకటాద్రి, యుగంధర్ బాబు, వెంకట్రామయ్య, సిఐలు, ఎస్సైలు , పోలీసు సిబ్బంది ఉన్నారు.