
ప్రజాశక్తి-పత్తికొండ (కర్నూలు) : పత్తికొండ పట్టణంలో ఈనెల 30న రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పర్యటన ఏర్పాట్లు పకడ్బందీగా ఉండాలని అధికారులను డిఐజి సెంథిల్ కుమార్ ఆదేశించారు. పత్తికొండలో సెయింట్ జోసెఫ్ స్కూల్లో ఈనెల 30న రాష్ట్ర ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి రైతు భరోసా బటన్ నొక్కు కార్యక్రమం బహిరంగ సభ ప్రాంగణాన్ని, ప్రభుత్వ జూనియర్ కళాశాలలో హెలిపాడ్ స్థలాన్ని డిఐజి సెంథిల్ కుమార్ జిల్లా ఎస్పీ కఅష్ణ కాంత్ ఎమ్మెల్యే శ్రీదేవి శుక్రవారం పరిశీలించారు. వారు వెంట ఆదోని సబ్ కలెక్టర్ అభిషేక్ కుమార్ ఆర్డిఓ మోహన్ దాసు డిఎస్పి శ్రీనివాసులు సిఐ మురళీమోహన్ తాసిల్దార్ విష్ణు ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.