
ఇంటర్నెట్‌డెస్క్ : పెళ్లిళ్ల సీజన్ వస్తే పెళ్లి కుమార్తెకి ఎలాంటి నగలు, పట్టుచీరలు కొనాలి అని తెగ ఆలోస్తుంటారు. పెళ్లి కుమార్తెగా ముస్తాబైన ఫొటోలను చాలామంది ఎంతోమంది అపురూపంగా దాచుకుంటారు. భూమిపై వివాహాలు చేసుకునేవారు వారి వారి సాంప్రదాయాలను బట్టి పెళ్లి కుమార్తెలు నగలను అలంకరించుకుంటారు. అదేమరి ఆకాశంలో వివాహాలు చేసుకుంటే వ్యోమగాములు పెళ్లి దుస్తుల్లో ఎలా ఉంటారు అన్న ఊహకు ప్రతిబింబంగా ఆర్టిస్ట్ జయేష్ సచ్‌దేవ్ విజువలైజ్ చేసిన ఫొటోలు నిలిచాయి. తాజాగా ఈ ఫొటోలు సచ్‌దేవ్ తన ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్టు చేశారు. ప్రస్తుతం ఈ ఫొటోలు నెట్టింట వైరల్‌గా మారాయి. ఈ ఫొటోలను చూసిన నెటిజన్లు ఆయన క్రిటేవిటీకి మెచ్చుకుంటూ కామెంట్స్ చేస్తున్నారు. నెటిజన్ల స్పందనలకు సచ్‌దేవ్ స్పందించారు. 'నేను గతంలో పిల్లులు, కోతుల్ని కూడా పెళ్లి దుస్తుల్లో విజువలైజ్‌గా పిక్స్ తీశాను. అవి అప్పట్లో సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. తాజాగా వ్యోమగాములు పెళ్లికుమార్తెలుగా ఎలా ఉంటారో ఊహించుకుని వీటిని రూపొందించాను. నెటిజన్లకి ఈ ఫొటోలు ఇంతగా ఆకట్టుకుంటాయి అని నేను ఊహించలేదు' అని జయేష్ సచ్‌దేవ్ అని అన్నారు.



