
ప్రజాశక్తి-విజయనగరం టౌన్ : చింతలవలస పివిజి రాజు క్రికెట్ మైదానంలో మంగళవారం అస్సాం, ఆంధ్ర జట్ల మధ్య రంజీ క్రికెట్ మ్యాచ్ ప్రారంభమైంది. తొలుత బ్యాటింగ్కు దిగిన అస్సాం జట్టు 113 పరుగులకు ఆలౌట్ అయ్యింది. అస్సాం జట్టును తక్కువ స్కోర్ చేయడంలో ఆంధ్ర జట్టు బౌలర్లు ఎం రాయుడు 4 వికెట్లు, కె వి శశికాంత్ 3 వికెట్లు తీసి కట్టడి చేశారు. అనంతరం బ్యాటింగ్ దిగిన ఆంధ్ర జట్టు తొలిరోజు అట ముగిసే సమయానికి 3 వికెట్ల నష్టానికి 160 పరుగులతో బ్యాటింగ్ చేసింది. దీంతో ఆంధ్రప్రదేశ్ జట్టుకు ఇప్పటికే 47పరుగుల తొలి ఇన్నింగ్స్ ఆధిక్యత లభించింది. ఆంధ్ర జట్టులో అభిషేక్ రెడ్డి 75, విహారి 80 పరుగులు చేసి ఆంధ్ర జట్టుకు గట్టి పునాది వేశారు.