May 26,2023 13:28

ప్రజాశక్తి-ఆత్మకూరు (అనంతపురం) : ఆత్మకూరు మండల కేంద్రంలోని ప్రభుత్వ వైద్యశాలను అసిస్టెంట్‌ కలెక్టర్‌ ప్రశాంత్‌ కుమార్‌ శుక్రవారం ఆకస్మితగా తనిఖీ చేశారు. గ్రామీణ ఆరోగ్య కేంద్రంను ఆకస్మిక తనిఖీ చేశారు. ఓ పి.విభాగం లో ల్యాబ్‌, ఫార్మసీ, డెలివరీ రూమ్‌ను పరిశీలించారు. క్షేత్రస్థాయిలో అసంక్రమిత వ్యాధుల సర్వే గురించి, ఫ్యామిలీ ఫిజిషిఎన్‌ విధానం గురించి అడిగి తెలుసుకున్నారు. ప్రభుత్వ వైద్యశాలకు వచ్చినవారికి సక్రమంగా వైద్యం చేసే విధంగా చూడాలని వైద్యులకు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఏఎన్‌ఎంలు, సిబ్బంది పాల్గొన్నారు.