
వడోదర: తలచుకుంటే సాధించనిది ఏదీ లేదు అని ఈ బామ్మ నిరూపించారు. తపన, సాధించాలన్న పట్టుదలకు వయస్సు అవరోధం కాదని రుజువు చేశారు హర్యానాకు చెందిన శతాధిక వృద్ధురాలు రాంబాయి. 105 ఏళ్ల వయసులో స్ప్రింట్ క్వీన్‌గా అందరినీ అవాక్కయ్యేలా చేశారు. వడోదరలో ఇటీవల అథ్లెటిక్ ఫెడరేషన్ నిర్వహించిన తొలి జాతీయ ఓపెన్ మాస్టర్ అథ్లెటిక్స్ చాంపియన్‌షిప్ 100 మీ. రేస్‌లో హరియాణాకు చెందిన రాంబాయి 45.40 సెకన్ల రికార్డు టైమింగ్‌తో స్వర్ణం సాధించారు. 85 ఏళ్లకు పైబడిన విభాగంలో ఈ రేస్ నిర్వహించగా.. ఆమెకు పోటీనిచ్చే వారే లేకపోయారు. సింగిల్‌గా రేసు ఆరంభం నుండి రాంబాయి నిలకడగా పరిగెత్తి గమ్యస్థానాన్ని చేరుకోవడంతో స్వర్ణం సాధించారు. ఈ క్రమంలో మాస్టర్స్‌లో విభాగంలో మన్ కౌర్ (74 సెకన్లు) జాతీయ రికార్డును రాంబాయి అధిగమించారు.
<
At 105 years, super grandma sprints new 100m record. #Rambai ran alone in #Vadodara as there was no competitor above 85 competing at the National Open Masters Athletics Championship pic.twitter.com/iCIPTOkuFt
— TOI Bengaluru (@TOIBengaluru) June 21, 2022