Oct 02,2022 20:52

ఓస్లో : ఇరాన్‌లో పోలీసుల కస్టడీలో మహసా అమిని మృతి తరువాత దేశవ్యాప్తంగా చెలరేగిన నిరసనల్లో 92 మంది మరణించారని నార్వేకు చెందిన ఇరాన్‌ మానవ హక్కుల (ఐహెచ్‌ఆర్‌) ఎన్‌జిఒ ఆదివారం వెల్లడించింది. 'ఈ నేరంపై విచారణ చేయడం, ఇస్లామిక్‌ రిపబ్లిక్‌ ద్వారా మరిన్ని నేరాలు జరగకుండా నిరోధించడం అంతరర్జాతీయ సమాజం బాధ్యత' అని ఐహెచ్‌ఆర్‌ డైరెక్టర్‌ మహమూద్‌ అమీర్‌-మొగద్దమ్‌ తెలిపారు. అంతకు ముందు ఈ నిరసనల్లో 82 మంది మరణించారని సంస్థ తెలిపింది.