
ప్రజాశక్తి - ఆత్మకూరు అర్బన్ : గుండెపోటుతో నెల్లూరు జిల్లా ఆత్మకూరు సర్కిల్ ఇన్‌స్పెక్టర్ నాగేశ్వరరావు(48) మరణించారు. సోమవారం మధ్యాహ్నం గుండె నొప్పిగా ఉందని ఆయన తన భార్యకు చెప్పారు. వెంటనే ఆమె ఎస్‌ఐకి విషయం చెప్పింది. స్థానిక అభిరామ్ ఆస్పత్రికి నాగేశ్వరరావును తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ మరణించారు. గుండెపోటుతో మరణించినట్లు వైద్యులు ధ్రువీకరించారు. ఆయనకు భార్య, కుమారుడు ఉన్నారు. మృతదేహానికి ఎస్‌పి నివాళులర్పించారు. నాగేశ్వరరావు ఆరునెలల క్రితమే పోలీస్ హెడ్ క్వార్టర్ మంగళగిరి నుంచి ఆత్మకూరు సిఐగా బాధ్యతలు చేపట్టారు.