Jun 27,2022 17:18

ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : ఆత్మకూరు ఉప ఎన్నికలో వైసిపి తరపున పోటీ చేసి గెలుపొందిన మేకపాటి విక్రమ్‌రెడ్డిని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి అభినందించారు. తాడేపల్లిలోని సిఎం క్యాంపు కార్యాలయంలో ఆత్మకూరు ఎమ్మెల్యే మేకపాటి విక్రమ్‌రెడ్డి, మంత్రులు కాకాణి గోవర్ధన్‌రెడ్డి, కారుమూరి నాగేశ్వరరావుతో కలిసి సిఎంను సోమవారం కలిశారు. అనంతరం విక్రమ్‌రెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. ప్రజల్లోకి సంక్షేమ పథకాలు వెళ్లాయనడానికి ఆత్మకూరు ఫలితాలే నిదర్శనమన్నారు. అందుకే ఇంతపెద్ద మెజార్టీతో ప్రజలు ఆదరించారన్నారు. ఆత్మకూరులో పారిశ్రామిక ప్రగతిపై దృష్టి పెట్టి, నిరుద్యోగులకు ఉపాధి కల్పించే దిశగా కృషి చేస్తానన్నారు.