Jun 23,2022 09:22

ప్రజాశక్తి-పెనుకొండ (శ్రీ సత్యసాయి జిల్లా) : రోజు రోజుకు చిన్నారులపై అత్యాచారాలు పెరిగిపోతున్నాయి. పోలీసులు చట్టాలు ఎన్ని తెచ్చిన దాడులు మాత్రం ఆగడం లేదు. తాజాగా ఓ మైనర్‌ బాలికపై అత్యాచారయత్నానికి పాల్పడిన ఘటన శ్రీ సత్యసాయి జిల్లాలో చోటుచేసుకుంది. శ్రీ సత్యసాయి జిల్లా పెనుకొండ పట్టణం ఊరు వాకిలి ఆంజనేయస్వామి దేవాలయం సమీపంలో రెండున్నారేళ్ల చిన్నారి పై గోరంట్ల మండలానికి చెందిన నిందితుడు నరసింహ అనే వ్యక్తి అత్యాచారయత్నానికి పాల్పడ్డాడని తల్లిదండ్రులు పెనుకొండ పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.