Jun 26,2022 13:25

పుత్తూరు టౌన్‌ (చిత్తూరు) : పంటలు పండేటప్పుడు కొన్నిసార్లు కొన్నిరకాల పండ్లు, కాయలు వింత ఆకృతిలో కనబడుతూ ఆశ్చర్యపరుస్తుంటాయి. ఇలాంటివి అరుదుగా అప్పుడప్పుడు కనిపిస్తుంటాయి. ఈ కోవలోనే తాజాగా ఓ మామిడికాయ పక్షి ఆకారంలో వచ్చింది. పుత్తూరు టౌన్‌ రూరల్‌ మండలంలోని గోపాలకృష్ణ పంచాయితీ గోపాలకృష్ణ పురానికి చెందిన సుబ్రహ్మణ్యం రాజు మామిడితోటలో తోతాపురి మామిడికాయ వింత పక్షి ఆకారంలో కనిపించి అందరినీ ఆకట్టుకుంటోంది. మామిడికాయల మండిలో ఆకర్షణగా నిలిచింది. ఈ మామిడికాయను చూస్తూ అక్కడి ప్రజలు ఆశ్చర్యపడుతున్నారు. ఔరా.. భలే ఉందే మామిడికాయ.. అచ్చు పక్షిలాగే..! అంటూ నోరెళ్లబెడుతున్నారు..!