
ముంబయి: ఆస్ట్రేలియా వేదికగా అక్టోబర్‌లో జరిగే టి20 ప్రపంచకప్‌ముందు ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికా జట్లు భారత పర్యటనకు రానున్నాయి. ప్రస్తుతం విండీస్‌తో ఐదు టీ20ల సిరీస్ ముగిసిన వెంటనే టీమిండియా జింబాబ్వే పర్యటనకు వెళ్లనుంది. ఈ నెలాఖరులోనే దుబారు వేదికగా ఆసియా కప్‌లోనూ ఆడనుంది. ఆసియా కప్ ముగిసిన తర్వాత, టి20 ప్రపంచకప్వరకు టీమిండియాకు దాదాపు నెలన్నర ఖాళీగా ఉండటంతో బిసిసిఐ ఈ రెండు సిరీస్‌లను ప్లాన్ చేసింది. సెప్టెంబర్ 20-25వరకు ఆస్ట్రేలియా, సెప్టెంబర్ 28-అక్టోబర్ 11వరకు దక్షిణాఫ్రికా జట్టు భారత్‌లో పర్యటించనున్నాయి. దీనికి సంబంధించిన షెడ్యూల్‌ను బిసిసిఐ గురువారం విడుదల చేసింది.
ఆస్ట్రేలియాతో టి20 సిరీస్..
సెప్టెంబర్ 20: తొలి టి20(మొహాలి)
సెప్టెంబర్ 23: రెండో టి20(నాగ్‌పూర్)
సెప్టెంబర్ 25: మూడో టి20(హైదరాబాద్)
దక్షిణాఫ్రికాతో వన్డే సిరీస్..
సెప్టెంబర్ 28- తొలి టీ20 (తిరువనంతపురం)
అక్టోబర్ 2- రెండో టీ20 (గౌహతి)
అక్టోబర్ 4- మూడో టీ20 (ఇండోర్)
టి20 సిరీస్..
అక్టోబర్ 6- తొలి వన్డే (లక్నో)
అక్టోబర్ 9- రెండో వన్డే (రాంచీ)
అక్టోబర్ 11- మూడో వన్డే (ఢిల్లీ)