Aug 09,2022 13:55

కామన్‌వెల్త్‌ గేమ్స్‌లో బ్యాడ్మింటన్‌ ఉమెన్స్‌ సింగిల్స్‌ ఫైనల్‌ ఈవెంట్‌లో సింధు అద్భుత ప్రదర్శన చేసి పసిడి నెగ్గిన పీవీ సింధుకు ప్రశంసలు కురుస్తున్నాయి. ఈ సందర్భంగా ఆస్ట్రేలియా క్రికెటర్‌ డేవిడ్‌ వార్నర్‌ ట్విటర్‌ వేదికగా సింధుకు అభినందనలు తెలిపాడు. ''వెల్‌డన్‌ సింధు.. అద్భుతమైన విజయం. పరిపూర్ణం'' అని క్యాప్షన్‌ ఇచ్చాడు
ఉమెన్స్‌ సింగిల్స్‌ ఫైనల్‌ ఈవెంట్‌లో సింధు కెనడా క్రీడాకారిణి మిచెల్లీ లీపై 21-15, 21-13 తేడాతో విజయం సాధించి స్వర్ణాన్ని ముద్దాడింది. దీంతో కామన్‌వెల్త్‌ గేమ్స్‌లో ఆమె తొలిసారి స్వర్ణం సాధించినట్టయ్యింది. గత కామన్‌వెల్త్‌ గేమ్స్‌-2018లో సింధు రజతానికే పరిమితమైన విషయం తెలిసిందే. కామన్వెల్త్‌లో భారత్‌ 61 పతకాలు సాధించి, పట్టికలో నాలుగో స్థానంలో నిలిచింది. ఇందులో 22 స్వర్ణాలు, 16 రజతాలు, 23 కాంస్య పతకాలు ఉన్నాయి.