
'అవతార్' మొదటి పార్ట్ వచ్చిన పదమూడేళ్ల తరువాత రెండో పార్ట్ 'అవతార్: ది వే ఆఫ్ వాటర్' డిసెంబర్ 16న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. తాజాగా ఈ సినిమా నుంచి ఇటీవల ట్రైలర్ విడుదలైంది. అవతార్ సినిమాను ఈసారి వాటర్‌లో తెరకెక్కించాడు జేమ్స్ కామెరాన్. ఈ సినిమా అడ్వాన్స్ బుకింగ్స్ మంగళవారం నుంచి దేశవ్యాప్తంగా ప్రీమియం ఫార్మాట్‌లలో ఓపెన్ అయ్యాయి. 20వ సెంచరీ స్టూడియోస్ ఇండియా నిర్మించిన ఈ చిత్రం ఇంగ్లిష్, హిందీ, తమిళం, తెలుగు, కన్నడ, మలయాళంలో విడుదల కానుంది.