
న్యూఢిల్లీ: మహిళా రెజర్లపై లైంగిక వేధింపుల ఆరోపణలను దర్యాప్తు చేసేందుకు ఏర్పాటు చేసిన పర్యవేక్షణ కమిటీలో మాజీ రెజ్లర్ బబిత ఫోగట్ చేరారు. మహిళా రెజ్లర్లపై లైంగిక వేధింపులు, బెదిరింపులు, ఆర్ధిక అవకతవలు, పరిపాలనాపరమైన లోపాలను విచారించేందుకు కేంద్ర క్రీడామంత్రి ఐదుగురు సభ్యులతో ఓ కవిటీని ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. తాజాగా ఆ కమిటీలో మాజీ రెజ్లర్, ఫోగాట్ సిస్టర్స్‌లో ఒకరైన బబిత వచ్చి చేరారు. ఈ నెలాఖరుకల్లా ఆ కమిటీ తమ రిపోర్టును క్రీడాశాఖకు సమర్పించాల్సి ఉంది. ఐఓఏ ఏర్పాటు చేసిన కమిటీలో మేరీకోమ్, యోగేశ్వర్ దత్, తృప్తి ముర్గుండే, రాధికాతోపాటు రాజేశ్ రాజగోపాలన్‌లు ఉండగా.. తాజాగా బబితా ఫోగాట్ చేరికతో పర్యవేక్షణ కమిటీ సభ్యుల సంఖ్య 6కు చేరింది.