
పాల బుగ్గలం
పసిడి మొగ్గలం
పరమార్థ పరువులం
మేము బాలలం
కదిలే కవాటాలం
బడి మాకు కలం
మా మార్గం బడిబాట
బడిలోన చదువుతాం
బడియే గుడి మాకు
బడి చదువేముద్దు మాకు
బడిబాట బాలలం
బడి హాయిని పొందుతాం
బడి భాషను పాడతాం
బడి తోటను పెంచుతాం
బడి అక్షర సుమాలు నేర్చుకుంటాం
తల్లి ఒడికి చేరతాం
వెలుగు బాట నేర్చుకుంటాం
అందరికీ చాటుతాం
భవిష్యత్తు బాటే బడిబాట
బడి తల్లికి అర్పిస్తాం
విద్య మాలను కడతాం
బడిబాట మాకు ఆదర్శం
- బాబు మస్తాన్ ఎస్.కె
99632 38215