
బెంగళూరు : శీతాకాలంలో కొన్ని రకాల ప్రత్యేకతలుంటాయి. ఈ కాలంలోనే కొన్ని రకాల పూలు వికసించి చూపరులను ఆకట్టుకుంటాయి. ఇటీవల బెంగళూరు నగరంలోని రోడ్డుకిరువైపులా ఉన్న పింక్ ట్రంపెట్స్ చెట్లకు గులాబీ రంగులో పూలు వికసించాయి. ఈ రోడ్డుపై వెళ్లే నగర ప్రజానీకం గులాబీ తోటలో విహరిస్తున్నట్లుగా మురిసిపోతున్నారు. వీటికి సంబంధించిన ఫొటోలను కర్ణాటక టూరిజం డిపార్ట్మెంట్ తన అధికారిక ట్విట్టర్లో పోస్టు చేసింది. ఈ ఫొటోలకు 'బెంగళూరులో పింక్ ట్రంపెట్స్ వికసించడం ప్రారంభమైంది. దీంతో బెంగళూరులోని కొన్ని ప్రాంతాలు పూర్తిగా గులాబీ రంగులోకి మారాయి.' అని కర్ణాటక డిపార్ట్మెంట్ జతచేసింది. జనవరి 16న పోస్టు చేసిన ఈ ఫొటోలు ప్రస్తుతం నెట్టింట్లో వైరల్గా మారాయి.



