Sep 22,2022 20:59

న్యూఢిల్లీ : గణిత అభ్యాస వేదిక అయినా భాన్జు తాజాగా సీరిస్‌ ఎ ఫండింగ్‌లో భాగంగా 15 మిలియన్‌ డాలర్లు (దాదాపు రూ.120 కోట్లు) సమీకరించినట్లు ప్రకటించింది. హైదరాబాద్‌ కేంద్రంగా ఈ సంస్థను నీలకంఠ భాను ప్రకాష్‌ ప్రారంభించారు. ఈ రౌండ్‌ ఫండ్‌కు అంతర్జాతీయ పెట్టుబడుల సంస్ధ ఎయిట్‌ రోడ్స్‌ వెంచర్స్‌ నేతృత్వం వహించగా.. మరో అంతర్జాతీయ ఇన్వెస్టర్‌ బీ క్యాపిటల్‌ సైతం పెట్టుబడులు పెట్టినట్లు పేర్కొంది. తమ సాంకేతిక మౌలిక సదుపాయాలను వద్ధి చేయడంతో పాటుగా అసాధారణ విద్యార్ధి అభ్యాస అనుభవాలను సష్టించేందుకు, మెరుగైన ఫలితాలను లక్ష్యంగా చేసుకున్న కంటెంట్‌తో తమ గణిత పాఠ్యాంశాలు (మ్యాథ్‌ కరిక్యులమ్‌)ను బలోపేతం చేసేందుకు భాన్జు ఈ నిధులను ఉపయోగించనున్నట్లు నీలకంఠ భాను తెలిపారు.