Aug 08,2022 20:28

వాషింగ్టన్‌ : గాజా తీవ్రవాదులపై విరుచుకుపడడం ద్వారా అమాయకులైన ప్రజల ప్రాణాలను కాపాడారంటూ ఇజ్రాయిల్‌ ప్రభుత్వాన్ని అమెరికా అధ్యక్షుడు బైడెన్‌ ప్రశంసల్లో ముంచెత్తారు. మూడు రోజుల పాటు ఇజ్రాయిల్‌, ,పాలస్తీనా పక్షాల మధ్య హోరాహోరీగా జరిగిన దాడుల్లో డజన్ల సంఖ్యలో పాలస్తీనియన్లు మరణించారు. ఆదివారం రాత్రి కాల్పుల విరమణ అమల్లోకి రావడంతో ఇరు పక్షాలు సద్దు మణిగాయి. ఇజ్రాయిల్‌ భద్రతకుమా మద్దతు శాశ్వతమైనది, తిరుగులేనిదని బైడెన్‌ వ్యాఖ్యానించారు. ఈ మేరకుఆదివారం రాత్రి ఒక ప్రకటన చేశారు. దాడులు జరిగినపుడు తన ప్రజలను కాపాడుకునే హక్కు ఇజ్రాయిల్‌కు వుందని అన్నారు. ఎదుటిపక్షం నుండి విచక్షణారహితంగా వస్తున్న దాడుల నుండి తన ప్రజలను కాపాడుకునేందుకు ఇజ్రాయిల్‌ చర్యలు తీసుకుందని అంటూ ప్రత్యేకంగా ఇజ్రాయిల్‌ ఉక్కు ఛత్రాన్ని బైడెన్‌ ప్రశంసించారు. దీనివల్ల వందలాది రాకెట్లను అడ్డుకోగలిగారని, అనేకమంది ప్రజలను కాపాడగలిగారని అన్నారు. కాగా గాజాలో పౌరుల మరణాలను విషాదంగా బైడెన్‌ వ్యాఖ్యానించారు. వీటిపై సకాలంలో, కూలంకషంగా దర్యాప్తు జరగాలని కోరారు.