Aug 09,2022 13:09

ఇంటర్నెట్‌డెస్క్‌ : మరోసారి బుల్లితెర ప్రేక్షకుల్ని అలరించేందుకు 'బిగ్‌బాస్‌' వచ్చేస్తున్నారు. ఈ విషయాన్ని అధికారికంగా తెలియజేసేందుకు తాజాగా ప్రోమోను విడుదల చేశారు. ఈ ప్రోమోలో..'అప్పగింతలప్పుడు నవవధువు కంటతడి పెట్టుకుంటూ ఎమోషనల్‌ అవుతుంది. ఆ సమయంలో తల్లిదండ్రులు కుమార్తెను ఓదార్చుతూ ఉండగా.. తల్లి సెల్‌ఫోన్‌ చూస్తుంటుంది. పెళ్లికూతురు ఏడుస్తూ ఉండగానే.. ఆమె తల్లి, తండ్రి, భర్తతో సహా అదృశ్యమవుతారు. దీంతో పెళ్లికుమార్తె ఆశ్చర్యం వ్యక్తం చేస్తూ.. వారి కోసం అన్వేషిస్తున్న సమయంలో.. కింగ్‌ నాగార్జున ఐస్‌క్రీమ్‌ తింటూ ఎంట్రీ ఇచ్చి...'అప్పగింతలు అయ్యే వరకు కూడా ఆగలేకపోయారంటే.. అక్కడ ఆట మొదలైనట్టే' అని బిగ్‌బాస్‌ షో గురించి చెబుతాడు.
అలాగే.. 'లైఫ్‌లో ఏ మూమెంట్‌ అయినా బిగ్‌బాస్‌ తర్వాతే'. బిగ్‌బాస్‌ సీజన్‌ సిక్స్‌.. ఎంటర్‌టైన్‌మెంట్‌కి అడ్డా ఫిక్స్‌ అంటూ.. నాగ్‌ చెప్పే సంభాషణలతో ఈ ప్రోమో ముగుస్తుంది. గతంలోలాగే ఈసారి కూడా ఈ షోకి మరోసారి నాగార్జున హోస్ట్‌గా వ్యవహరిస్తున్నారు. ఎప్పటిలాగే ఈసారి కూడా సెప్టెంబర్‌లో కొత్త సీజన్‌ ప్రారంభం కానుంది. ఈసారి ఎక్కువగా సినిమా రంగానికి చెందిన వారినే షోకి తీసుకోబోతున్నారని వార్తలు వినిపిస్తున్నాయి. మరి ఎవరెవరు బిగ్‌బాస్‌ హౌస్‌కి రాబోతున్నారనేది తెలుసుకోవాలంటే మరికొద్దిరోజులు ఆగాల్సిందే. ఈ షో స్టార్‌ మాతోపాటు, డిస్నీప్లస్‌ హాట్‌స్టార్‌లోనూ స్ట్రీమింగ్‌ కానుంది.