
పాట్నా : తమిళనాడులో బీహార్‌కు చెందిన వలస కార్మికులను ఆ రాష్ట్ర ప్రభుత్వం తీవ్రంగా వేధిస్తోందని గత కొన్నిరోజులుగా సోషల్‌మీడియాలో వీడియోలు ట్రోల్ అయ్యాయి. అయితే వలస కార్మికులను హింసిస్తున్నట్టుగా ఫేక్ వీడియోలను పోస్టు చేసిన యూట్యూబర్ కశ్యప్‌ని ఎట్టకేలకు శనివారం ఉదయం బీహార్ పోలీసులు అరెస్టు చేశారు. కశ్యప్‌ని పశ్చిమ చంపారన్ జిల్లాలోని బెట్టియా వద్ద ఉన్న జగదీశ్ పోలీస్ స్టేషన్ పరిధిలో కశ్యప్‌ను బీహార్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. శనివారం ఆర్థిక నేరాల శాఖ అధికారులు కశ్యప్ ఇంటికి వెళ్లి అతని ప్రాపర్టీలను అటాచ్ చేసుకున్నారు. దీంతో అతను బీహార్ పోలీసులకు లొంగిపోయాడు.
కాగా, బీహార్ వలస కార్మికులపై ఫేక్ వీడియోలను సోషల్‌మీడియాలో పోస్టు చేసినందుకు అతనిపై ఆరోపణలున్నాయి. ఇలా ఫేక్ వీడియోలు పోస్టు చేస్తున్న కశ్యప్‌ని అటు బీహార్, ఇటు తమిళనాడు పోలీసులు గత కొన్నిరోజులుగా గాలిస్తున్న సంగతి తెలిసిందే. ఇక కశ్యప్‌పై ఆర్థిక నేరాల శాఖ మొత్తం మూడు కేసుల్ని నమోదు చేసింది. అలాగే తమిళనాడులో ఇతనిపై 13 కేసులు నమోదవ్వగా, బీహార్ రాష్ట్రంలోనూ ఆరు కేసులు నమోదుయ్యాయి.