
అమెరికా : సాఫ్ట్వేర్ దిగ్గజం బిల్‌గేట్స్-సూపర్‌స్టార్ మహేష్ బాబు ఒకే ఫ్రేములో ఫొటో దిగి అభిమానులను అలరించారు. ప్రస్తుతం మహేశ్‌బాబు ఫ్యామిలీతో విదేశీ టూర్లో ఆనందంగా గడుపుతున్నారు. ఈ క్రమంలో అరుదైన సన్నివేశం చోటుచేసుకుంది. ఇంకేముంది కెమెరా క్లిక్ కొట్టింది. ఫొటో సోషల్ మీడియాలో తెగ సందడి చేసేస్తోంది.
బిల్‌గేట్స్‌తో ఫొటో.. మహేశ్ ట్వీట్..
సర్కారువారిపాట సినిమా అనంతరం మహేశ్‌బాబు ఓ వెకేషన్ కోసం ఫ్యామిలీతో విదేశీ టూర్‌కు వెళ్లారు. గత కొన్ని రోజులుగా మహేష్ బాబు విదేశీ టూర్‌కు సంబంధించిన వీడియోలు, ఫోటోలను ఆయన అభిమానులు సోషల్ మీడియాలో షేర్ చేస్తూ సందడి చేస్తున్నారు. ఈక్రమంలో.. తాజాగా అమెరికా పర్యటనలో న్యూయార్క్ నగరంలో సాఫ్ట్వేర్ దిగ్గజం బిల్‌గేట్స్‌ను మహేష్ బాబు ఆయన భార్య నమ్రతా శిరోద్కర్ కలిశారు. దీనికి సంబంధించిన ఫోటోను మహేష్ బాబు షేర్ చేస్తూ.. ' బిల్‌గేట్స్ ప్రపంచంలోని గొప్ప దార్శనికులలో ఒకరు. అంతకంటే ఎక్కువగా వినయంతో ఉన్నారు. నిజంగా మీరు ఒక స్ఫూర్తి ' అని ట్వీట్ చేశారు. దీంతో క్షణాల్లోనే మహేష్ చేసిన ట్వీట్ వైరల్‌గా మారింది.