Sep 22,2022 06:55

పిల్లలూ, బీర్బల్‌ సహానీ పేరు వినగానే పురావృక్ష శాస్త్రం గుర్తుకు వస్తుంది. మరి ఆయన గురించి ఈ రోజు తెలుసుకుందామా!
బీర్బల్‌ సహానీ నవంబర్‌ 14, 1891న ఇప్పటి పాకిస్థాన్‌లోని 'భేరా'లో జన్మించారు. చిన్నప్పటి నుంచి మొక్కలను, రాళ్ళను, శీలాజాలను పరిశీలించడం పట్ల ఆసక్తి చూపేవారు. మన దేశంలో వృక్షశాస్త్రం గురించి లోతుగా పరిశోధన చేయటం వీరితోనే మొదలైంది. బీర్బల్‌ ఒక చిన్న బోటనీ మ్యూజియంలో కూర్చుని పరిశోధనలు చేయటం ఒక విదేశీ శాస్త్రవేత్తను ఆశ్చర్యచకితుడిని చేసింది. ఈయన లాహోర్‌లోని పంజాబ్‌ యూనివర్సిటీ నుంచి పట్టభద్రుడైన తర్వాత బ్రిటిన్‌లోని లండన్‌ యూనివర్సిటీ నుంచి 'డాక్టర్‌ ఆఫ్‌ సైన్స్‌' పట్టా పుచ్చుకున్నారు. కేంబ్రిడ్జి యూనివర్సిటీ నుంచి కూడా 'డాక్టర్‌ ఆఫ్‌ సైన్స్‌' పట్టాను పుచ్చుకున్న ప్రథముడిగా కీర్తి గడించారు. 1936లో సహానీని 'ఫెలో ఆఫ్‌ ది రాహల్‌ సొసైటీ' అధ్యక్షుడిగా ఎన్నుకున్నారు.
ప్రాచీన శిలాజ మొక్కల గురించి కూలంకషంగా అధ్యయనం చేసిన ఈయన బీహార్‌లోని రాజమహ ల్‌ కొండల్లోని సమస్త వృక్ష జాలాన్ని పరిశో ధించారు. ఈయన ఆవిష్కరించిన 'పెంటో గ్జైలియా' అనే 'జిమ్మోస్పెర్మ్‌' శిలాజం ప్రపంచ వ్యాప్తంగా శాస్త్రజ్ఞుల దృష్టిని ఆకర్షించింది. సహాని 'భూగర్భ' శాస్త్రవేత్త కూడా. కొన్ని రకాల శిలల వయస్సును సున్నితమైన పరికరాలు లేకపోయిప్పటికీ కచ్చితంగా నిర్ణయించారు. మధ్యప్రదేశ్‌ లోని 'డెక్కన్‌ ట్రూవ్స్‌' శిలల వయస్సు 62 కోట్ల సంవత్సరాలని తెలిపారు. ఈయన చిత్రకారుడు కూడా. స్టాంపులు, నాణేలు సేకరించటం అంటే ఇష్టం.
1949లో భారత ప్రధాని 'బీర్బల్‌ సహానీ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ పేలియో బోటనీ' సంస్థకు శంకు స్థాపన చేసిన కొద్ది రోజులకే 'సహాని' కన్నుమూశారు. పరిశోధనలు అంటే ప్రాణంగా భావించే సహానీ అందరి హృదయాల్లో చిరస్థాయిగా ఉంటారు.