Oct 05,2022 14:36

ప్రజాశక్తి - బాపట్ల : బాపట్ల జిల్లా సూర్యలంక బీచ్‌లో మంగళవారం సమద్ర స్నానానికి వెళ్లిన ఏడుగురు విద్యార్థులు గల్లంతయిన విషయం తెలిసిందే.. వీరిలో ఇద్దరిని గజ ఈతగాళ్లు కాపాడారు. మూడు మృతదేహాలు మంగళవారం రోజే లభ్యమయ్యాయి. మరో ఇద్దరి కోసం గాలింపు చర్యలు చేపట్టగా బుధవారం నాల్గో మృతదేహం లభ్యమైంది. సూర్యలంక గోడ వద్దకు కొట్టుకు వచ్చిన మృతదేహన్ని ఎన్‌డీ అర్‌ఎఫ్‌ బందం గుర్తించి ఒడ్డుకు తీసుకువచ్చింది. మృత దేహాన్ని మెరైన్‌ సిఐ సుబ్బారావు, సిబ్బంది బాపట్ల ఏరియా వైద్యశాలకు తరలించారు.అక్కడి నుండి విజయవాడకు తరలించారని వైద్యులు తెలిపారు.