Jun 27,2022 12:13

ముంబయి : తాను త్వరలో తల్లి కాబోతున్నట్లు బాలీవుడ్‌ నటి ఆలియాభట్‌ తెలిపారు. ఈ సందర్భంగా ఆస్పత్రిలో స్కాన్‌ చేయించుకున్న ఓ అపురూప చిత్రాన్ని ఆమె షేర్‌ చేశారు. '' మా బేబీ త్వరలో ఈ భూమ్మీదకు రానుంది '' అని పేర్కొన్నారు. ప్రస్తుతం ఈ ఫొటో సోషల్‌ మీడియాలో సందడి చేస్తోంది.

బాలీవుడ్‌ నటుడు రణ్‌బీర్‌ కపూర్‌ని ఆమె ప్రేమ వివాహం చేసుకున్న సంగతి విదితమే. చిన్నప్పటి నుంచి స్నేహితులైన వీరిద్దరూ పెద్దల సమక్షంలో ఏప్రిల్‌ 14 న ఒక్కటయ్యారు. ఆలియా చెప్పిన శుభవార్తతో.. భట్‌, కపూర్‌ కుటుంబాల్లో ఆనందం నెలకొంది. ఆలియాభట్‌ పెట్టిన పోస్ట్‌పై సెలబ్రిటీలు, నెటిజన్లు స్పందిస్తున్నారు. ఆలియాకు శుభాకాంక్షలు చెబుతూ కామెంట్స్‌ పెడుతున్నారు.