
హైదరాబాద్ : ఇమాజిన్ మార్కెటింగ్ లిమిటెడ్‌కు చెందిన డెఫీ బ్రాండ్ కొత్తగా గ్రావిటీ జెడ్ టిడబ్ల్యుఎస్ బడ్స్‌ను ఆవిష్కరించినట్లు ప్రకటించింది. ఇవి ఏకదాటిగా 50 గంటల బ్యాటరీ జీవితం కలిగి ఉంటాయని ఆ సంస్థ పేర్కొంది. ఇందులో 13ఎంఎం డైనమిక్ డ్రైవర్స్ ఉన్నాయని తెలిపింది. కేవలం 10 నిమిషాల చార్జ్‌తో మూడు గంటల బ్యాటరీ బ్యాకప్ లభిస్తుందని పేర్కొంది. ఈ బడ్స్‌ను ఆన్లైన్లో రూ.999కు అందిస్తున్నట్లు తెలిపింది.