Sep 14,2023 16:07

ఇంటర్నెట్‌డెస్క్‌ : నేటికాలంలో పెళ్లిళ్లు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. పెళ్లి మండపం దగ్గర నుంచి.. విందు వరకు అన్నీ గ్రాండ్‌గా ఉంటున్నాయి. ఇక పెళ్లికొడుకు, పెళ్లికూతురు అలంకరణ ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. అలాగే నేటితరం యువత తమ వివాహ వేడుకల్లో ఏదో ఒకటి ప్రత్యేకత ఉండేలా చూసుకుంటున్నారు. తాజాగా ఓ పెళ్లిలో.. పెళ్లికూతురు ఓ రాణిలా మండపానికి వచ్చింది. తనకు కాబోయే భర్త చేతిని పట్టుకుని కల్యాణ మండపంలో తను కాలు పెట్టగానే.. తన డ్రెస్‌కున్న పొడవాటి క్లాత్‌ పైకెగురుతూ.. రెడ్‌, బ్లాక్‌ కలర్‌ బెలూన్లు గాల్లో ఎగిరాయి. వధువుని చూసిన బంధువులందరూ షాక్‌ అయ్యారు. ఈ వీడియో సోషల్‌మీడియాలో వైరల్‌ అయింది. ఈ వీడియోను చూసిన నెటిజన్లు 'వావ్‌ ఏం ఐడియా గురూ' అని కామెంట్స్‌ పెడుతున్నారు.