Jun 24,2022 09:20

ప్రజాశక్తి - జంగారెడ్డిగూడెం (ఏలూరు): ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెం మండలం దేవులపల్లిలో తీవ్ర విషాదం నెలకొంది. బైక్‌పై వెళ్తున్న అన్నదమ్ములపై 11కేవీ విద్యుత్‌ వైరు తెగి పడటంతో యువకులు దారిలోనే సజీవ దహనమయ్యారు. వివరాల్లోకి వెళితే.. దేవులపల్లి గ్రామానికి చెందిన అన్నదమ్ములు వల్లేపల్లి నాగేంద్ర (21), వల్లేపల్లి ఫణీంద్ర (19) పాలు తెచ్చేందుకు పొలం వద్దకు బైక్‌పై బయల్దేరారు. మార్గంమధ్యలో బైక్‌పై 11కేవీ విద్యుత్‌ వైరు తెగి పడటంతో మంటలు చెలరేగాయి. దీంతో బైక్‌పై ఉన్న అన్నదమ్ములిద్దరూ అక్కడికక్కడే సజీవ దహనమయ్యారు. దీంతో గ్రామంలో విషాదచాయలు అలుముకున్నాయి. మతుల్లో నాగేంద్ర ఇంజినీరింగ్‌ ఫైనల్‌ ఇయర్‌ చదువుతుండగా.. ఫణీంద్ర ఇంటర్‌ సెకండియర్‌ పూర్తిచేశారు.