Aug 05,2022 14:36

అమరావతి : వైఎస్సార్‌సిపి అంటే యువజన శృంగార రసిక చిలిపి పార్టీ అని టిడిపి నేత బుద్దా వెంకన్న ట్విటర్‌లో వ్యగ్యంగా అర్థం చెప్పారు.ఈ సందర్భంగా ఆయన ట్విట్‌ చేస్తూ వైఎస్‌ జగన్‌రెడ్డి శివకుమార్‌ నుంచి ముందుగా లీజుకి తీసుకుని ఆ తరువాత పూర్తి యాజమాన్య హక్కులు సంపాదించిన యువజన శృంగార రసిక చిలిపి పార్టీగా పేరుని సార్థకం చేసుకుందన్నారు. వైసిపి ఆశీస్సులతో ఇప్పటి వరకూ అవంతి శ్రీనివాస్‌ అరగంట సరసం, అంబటి గంట విరహం ఆడియోలు బయటకొస్తే.. వారిపై జగన్‌రెడ్డి ఏం చర్యలు తీసుకోలేదని విమర్శించారు. పార్టీ బ్రాండింగ్‌ అయిన ఇటువంటి రాసలీలలు చేయడం కాదన్నారు. ఎంపీ గోరంట్ల మాధవ్‌ న్యూడ్‌గా మహిళని సెక్సువల్‌ హెరాస్‌ చేస్తూ చేసిన వీడియో కాల్‌ సోషల్‌ మీడియాలో వైరల్‌ అయిందన్నారు. ఇప్పుడు ఎంపీ గోరంట్లపై చర్యలు తీసుకుంటారో.. లేక అంబటిలా పదవి ఇచ్చి గౌరవిస్తారో చూద్దామని బుద్దా వెంకన్న అన్నారు.