
హీరో సుహాస్ 'రైటర్ పద్మభూషణ్' చిత్రంలో నటిస్తున్నాడు. ఫన్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా చిత్రాన్ని షణ్ముఖ ప్రశాంత్ డైరెక్షన్‌లో తెరకెక్కిస్తున్నారు. ఈ చిత్రం ఫిబ్రవరి 3న థియేటర్లలో విడుదలకు సిద్ధం అయ్యింది. ఈ నేపథ్యంలో సుహాస్ టీం ఇప్పటికే తెలుగు రాష్ట్రాల్లో ప్రమోషన్స్ కార్యక్రమాలు చేస్తుంది. మూవీ లవర్స్ కోసం టికెట్ రేట్ల అప్‌డేట్ అందించారు మేకర్స్. ఫ్యామిలీతో వెళ్లాలంటే టికెట్ రేట్లు బడ్జెట్‌లో ఉండేలా.. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లో సింగిల్ స్క్రీన్స్ థియేటర్లలో (బాల్కనీ) రూ.110, మల్టీప్లెక్స్ లో తెలంగాణలో రూ.150, ఏపీలో రూ.177గా (జీఎస్టీతో కలిపి) నిర్ణయించారు. జీ మనోహరన్ సమర్పణలో లహరి ఫిలిమ్స్ -ఛారు బిస్కెట్ ఫిలిమ్స్ బ్యానర్లపై అనురాగ్ రెడ్డి, శరత్ చంద్ర, చంద్రు మనోహర్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. శేఖర్ చంద్ర, కల్యాణ్ నాయక్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు.