
లక్నో : ఉత్తర్ప్రదేశ్ రాజధాని లక్నో మంగళవారం ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. ఇజ్రత్ గంజ్ ప్రాంతంలో ఐదు అంతస్తుల భవనం కుప్పకూలిపోయింది. ఈ ప్రమాదంలో ముగ్గురు మృతి చెందారు. శిధిలాల్లో ఇంకా ఎనిమిది మంది చికుకున్నట్లు సమాచారం. మంగళవారం సంభవించిన భూకంప కారణంగా ఈ భవానికి ముందుగా పగుళ్లు ఏర్పాడ్డాయని, తరువాత ఈ భవనం కూలిపోయిందని స్థానికులు చెబుతున్నారు. సమాచారం తెలిసిన వెంటనే ఎన్డిఆర్ఎఫ్, ఇతర సహాయక బృందాలు సంఘటన స్థలానికి చేరుకొని సహాయక చర్యలు చేపడుతున్నాయి. అగ్నిమాపక సిబ్బంది కూడా సంఘటన స్థలికి చేరుకున్నారు. సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. నేపాల్ సంభవించిన భూకంపం ప్రభావ కారణంగా ఉత్తర భారతంలోనూ భూ ప్రకంపనలు చోటు చేసున్నట్లు వార్తలు వచ్చాయి. భవనం కుప్పకూలిన సంఘటను ఉత్తరప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి బ్రజేష్ పతక్ ధ్రువీకరించారు. ఈ ఘటనలో ఇప్పటి వరకు మూడు మృతదేహాలను వెలికి తీసినట్లు చెప్పారు. మరికొందరు శిథిలాల్లో చిక్కుకున్నట్లు ఆయన వెల్లడించారు. బాధిత కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు.