Mar 18,2023 06:48

అమ్మ చూపెను
చందమామను
బుజ్జాయి తినెను
హాయిగా గోరుముద్దను

నాన్న తెచ్చెను
కొయ్యగుర్రమును
బుజ్జాయి గుర్రమెక్కెను
ఆనందంగా ఊరేగుచుండెను

తాత తెచ్చెను
జామ పండును
బుజ్జాయి తినేను
ఎగిరి గెంతులేసెను

మామ వచ్చెను
కారు బొమ్మ తెచ్చెను
బుజ్జాయి పట్టుకొని బొమ్మను
చక్కగా ఆడుకొనెను

అత్త వచ్చెను
పలక తెచ్చెను
పలక మీద రాత రాసెను
బుజ్జాయి మురిసిపోయెను

నానమ్మ ఇచ్చెను
గ్లాసు పాలును
చక్కగా తాగేను

బుజ్జాయి నిదురపోయెను
మొర్రి గోపి, 88978 82202