Jun 23,2022 11:46

న్యూఢిల్లీ : ఐదు రాష్ట్రాలు, ఒక కేంద్ర పాలిత ప్రాంతంలో మూడు లోక్‌సభ, ఏడు అసెంబ్లీ స్థానాలకు గురువారం ఉప ఎన్నికలు ప్రశాంతంగా కొనసాగుతున్నాయి. ఉదయం 7 గంటలకు ఎన్నికలు ప్రారంభమయ్యాయి. బరిలో త్రిపుర ముఖ్యమంత్రి మాణిక్‌ సాహా కూడా ఉన్నారు. ఢిల్లీ, ఉత్తరప్రదేశ్‌, పంజాబ్‌, త్రిపుర, ఆంధ్రప్రదేశ్‌, జార్ఖండ్‌లో ఈ ఎన్నికలు జరుగుతున్నాయి. యుపిలోని అజంఘర్‌, రామ్‌పూర్‌, పంజాబ్‌లోని సంగ్రూర్‌ లోక్‌సభ స్థానాలకు పోలింగ్‌ కొనసాగుతోంది ఢిల్లీలోని రాజేంద్ర నగర్‌, జార్ఖండ్‌లోని మందర్‌, ఆంధ్రప్రదేశ్‌లోని ఆత్మకూర్‌, అగర్తలా, సుర్మా, త్రిపురలోని అగర్తలా, టౌన్‌బోర్డోవాలీ, సుర్మా, జుబ్‌రాగ్‌ నగర్‌కు పోలింగ్‌ జరుగుతోంది.

ఉదయం 11 గంటల వరకు ఓటింగ్ శాతం

ఆత్మకూర్ (ఆంధ్రప్రదేశ్)లో 24.92% 
అగర్తల (త్రిపుర)లో 34.26%
టౌన్ బార్దోవాలి (త్రిపుర)లో 35.43%
సుర్మా (త్రిపుర)లో 33.50%
జుబరాజ్‌నగర్ (త్రిపుర)లో 29.14%
మందర్ (జార్ఖండ్)లో 29.13%
రాజిందర్ నగర్ (ఢిల్లీ)లో 14.85%