
ప్రజాశక్తి-ఉదయగిరి( నెల్లూరు జిల్లా) : గ్రామ సమస్యలు తీర్చుకొనుటకు యువత ఆదర్శంగా ఉండాలని సిఐ గిరిబాబు అన్నారు. వెంగళరావు నగర్ గ్రామంలో షేక్ ఆరిష్ ఏర్పాటు చేసిన వాటర్ ప్లాంట్‌ను బుధవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామాల్లోని సమస్యలను పరిష్కరించడానికి యువత ముందుండాలన్నారు. గ్రామ అభివృద్ధిలో యువత ఆదర్శంగా నిలవాలన్నారు. తాగునీటి సమస్య తీవ్రంగా ఉన్న నేపథ్యంలో సమస్యలను గుర్తించి వాటర్ ప్లాంట్ ఏర్పాటు చేయడం అభినందనీయమన్నారు. యువత అఘాయిత్యాలు జరగకుండా కొత్తవారి సంచారం చేస్తుంటే గుర్తించే సమాచారం అందించాలన్నారు. ముఖ్యంగా సైబర్ నేరగాళ్లు అధికమయ్యారని యువత వాటిపై దష్టి పెట్టి ఎటువంటి సైబర్ నెరగాల నుండి జాగ్రత్త పడాలన్నారు. గ్రామంలోని మహిళలు విద్యార్థినిలు తప్పనిసరిగా దిశ యాప్‌ను మొబైల్లో ఉండేలా చూసుకోవాలన్నారు. దిశా యాప్ ఉంటే పోలీసులు రక్షణ ఉన్నట్టే అన్నారు. ఈ కార్యక్రమంలో ఎస్‌ఐ అంకమ్మ, గ్రామ సర్పంచ్ తిరుపతి, మాజీ సర్పంచ్, గ్రామస్తులు పాల్గొన్నారు.