Aug 19,2022 07:10

ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : వైసిపి ఎంపి గోరంట్ల మాధవ్‌ వీడియో కేసును నీరుగార్చడానికి సిఐడి చీఫ్‌ సునీల్‌ కుమార్‌ ప్రయత్నిస్తున్నారని టిడిపి పొలిట్‌బ్యూరో సభ్యులు వర్ల రామయ్య ఆరోపించారు. ఈ మేరకు గురువారం ఒక ప్రకటన విడుదల చేశారు. ఆయనతోపాటు అనంతపురం ఎస్‌పి ఫక్కీరప్ప సహా ఈ కేసుతో సంబంధం ఉన్న పోలీసు అధికారులంతా జైలుకు వెళ్తారని హెచ్చరించారు. ఫిర్యాదు లేకపోవడం వల్ల మాధవ్‌ ఫోన్‌ను స్వాధీనం చేసుకుని దర్యాప్తు కొనసాగించలేమని చెబుతున్నారని, అలాంటప్పుడు ఎఫ్‌ఐఆర్‌ లేకుండా ఫారిన్‌ ఏజెన్సీతో ఎలా సంప్రదింపులు జరిపారని ప్రశ్నించారు. వీడియోను ఫోరెన్సిక్‌ ల్యాబ్‌కు పంపుతారా? లేదా? అని సిఎం జగన్‌ను టిడిపి పొలిట్‌బ్యూరో సభ్యులు బోండా ఉమామహేశ్వరరావు నిర్వహించిన విలేకరుల సమావేశంలో ప్రశ్నించారు.