Aug 06,2022 22:43
  • అత్యవసర సర్కులర్‌ జారీ
  • చెల్లించిన రశీదులు సమర్పించాలంటూ హుకుం
  • త్వరలో రాష్ట్రమంతా ఇదే విధానం?

ప్రజాశక్తి - అమరావతి బ్యూరో : విజయవాడ నగరపాలక 'చెత్త' ఉత్తర్వులను జారీ చేసింది. సిబ్బంది జీతాలకు, చెత్త పన్ను చెల్లింపులకు ముడిపెడుతూ సర్క్యులర్‌ జారీ చేసింది. ప్రజారోగ్యశాఖలోని ఉద్యోగులు, తాత్కాలిక సిబ్బంది అందరూ చెత్తపన్ను కట్టినట్లు రశీదులు సమర్పించాలని లేని పక్షంలో జీతం నిలిపివేస్తామని ఈ సర్కులర్‌లో పేర్కొన్నారు. శుక్రవారం (ఐదవతేది) సర్కులర్‌ జారీ చేసి శనివారం (6వ తేది) ఉదయం 10.30 గంటల కల్లా రశీదులు అందచేయాలని హుకుం జారీ చేయడం కలకలం రేపింది. ప్రధాన వైద్యశాఖాధిరి (ఇన్‌ఛార్జి) పేరిట జారీ అయిన ఈ ఉత్తర్వులు చర్చనీయాంశంగా మారాయి. రాష్ట్ర ప్రభుత్వం నుండి ఆదేశాలు లేనిదే పన్నులకు, జీతాల చెల్లింపునకు అధికారులు ముడిపెట్టలేరను అభిప్రాయం వ్యక్తమవుతోంది. అదే నిజమైతే త్వరలో రాష్ట్రమంతా ఇదే విధానం అమలయ్యే అవకాశం ఉందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. అదే విధంగా ప్రస్తుతానికి నగరపాలక సిబ్బందిలోని ప్రజారోగ్యశాఖ సిబ్బందికే దీనిని పరిమితం చేసినప్పటికీ భవిష్యత్తులో అనిు ప్రభుత్వ శాఖల్లోని సిబ్బందికి వర్తింపచేసే అవకాశం ఉందను ఆందోళన వ్యక్తమవుతోంది. చెత్తపనుు విధింపును రాష్ట్ర వ్యాప్తంగా ప్రజానీకం వ్యతిరేకిస్తును సంగతి తెలిసిందే. వామపక్షాల ఆధ్వర్యంలో ఆందోళనలూ జరిగాయి. దీంతో అనేకచోట్ల చెత్తపనుు వసూళ్ల లక్ష్యాలను ప్రభుత్వం చేరుకోలేకపోయింది. అయితే, ఎలాగైనా ఈ పనుును విధించే తీరాలను పట్టుదలతో రాష్ట్రం ప్రభుత్వం ఉంది. మరోవైపు విజయవాడ నగరపాలక సంస్థ జారీ చేసిన ఉత్తర్వుల్లో చెత్తపనుు అనినేరుగా పేర్కొనలేదు. దానికి బదులుగా యూజర్‌ఛార్జీలు అనిపేర్కొనాురు. దీంతో రానును రోజుల్లో అనిు రకాల యూజర్‌ఛార్జీలను జీతాలతో ముడిపెట్టి వసూలు చేసే అవకాశం ప్రభుత్వానికి లభించనుంది.

  • సర్క్యులర్‌లో ఏమంది...?

'విజయవాడ నగరపాలక సంస్థలో పనిచేస్తును అవుట్‌డోర్‌, ఇండోర్‌ సిబ్బంది తప్పనిసరిగా రాష్ట్ర ప్రభుత్వ ఉత్తర్వుల ప్రకారం యూజరు ఛార్జీలు చెల్లించాల్సి ఉంది' అని సర్క్యులర్‌ లో పేర్కొన్నారు. నగరపాలక సంస్థలో పనిచేసే సిబ్బంది అని స్పష్టంగా రాసినప్పటికీ తాజా ఉత్తర్వులను మాత్రం ప్రజారోగ్యశాఖ సిబ్బందికి పరిమితం చేయడం గమనార్హం. డివిజన్ల వారిగా ఆగస్టు 2022 వరకు చెల్లించిన యూజర్‌ఛార్జీల రశీదులను ప్రజారోగ్యశాఖ సెక్షన్‌లోని సర్కిళ్ల వారిగా డేటా ఎంట్రీ ఆపరేటర్లకు సమర్పించాలని ఆదేశించారు. అలా సమర్పించని వారికి ఆగస్టు నెల జీతం చెల్లించేదిలేదని పేర్కొన్నారు, రశీదుతో పాటు పేరు, హోదా, ఫోన్‌నెంబర్‌, చెల్లించిన మొత్తం,తో పాటు రశీదు ఐడి నెంబర్‌ తదితర వివరాలు కూడా అందచేయాలని ఆదేశించారు. ఒకటి, రెండు రశీదులు కాకుండా ఆగస్టు వరకుచెల్లించిన అనిు రశీదులను సమర్పించాలని పేర్కొనడం, దానికి 24 గంటల సమయం మాత్రమే ఇవ్వడం గమనార్హం. చేసిన పనికి జీతం చెల్లించాల్సి ఉండగా. దానికి యూజర్‌ఛారీ.ల చెల్లింపునకూ ముడిపెడుతూ సర్క్యులర్‌ జారీ చేయడం చర్చనీయాంశంగా మారింది

  • ఎవరెవరు?

తాజా సర్క్యులర్‌ ప్రకారం ప్రజారోగ్యశాఖలోనిపర్మినెంటు, తాత్కాలిక సిబ్బంది అందరూ ఈ మేరకురశీదులు సమర్పించాలి. సిబ్బంది వివరాలను కూడా సర్క్యులర్‌లో స్పష్టంగా పేర్కొన్నారు. దాని ప్రకారం
మెడికల్‌ సిబ్బంది
వర్కర్లు
మేస్త్రీలు
శానిటరి ఇన్‌స్పెక్టర్లు
శానిటరీ సూపర్‌వైజర్లు
వార్డు హెల్త్‌ సెక్రటరీలు
వార్డు శానిటరీ సెక్రటరీ,
వార్డు అడ్మిన్‌
పారిశుద్య పర్మినెంటు, అవుట్‌సోర్సింగ్‌ సిబ్బంది

  • తక్షణమే ఉపసంహరించాలి : బాబురావు

కార్మిక చట్టాలు, నిబంధనలకు భిన్నంగా విజయవాడ నగరపాలక సంస్ధ అధికారులు ఇచ్చిన ఆదేశాలు తక్షణమే ఉపసంహరించాలని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు సిహెచ్‌ బాబూరావు డిమాండ్‌ చేశారు. . చెత్త పన్ను వసూలు చేయటమే రాజ్యాంగ విరుద్ధం కాగా, చెల్లించకపోతే అందరికీ జీతాలు ఆపేస్తామని ప్రకటించడం దుర్మార్గమన్నారు. కరోనా కష్టకాలంలో సైతం ప్రాణాలకు తెగించి పనిచేసిన పారిశుద్ధ్య సిబ్బందికి చెత్త పన్ను నుండి మినహాయింపు ఇవ్వాల్సింది పోయి, వేతనాలకు చెత్త పనుుకుముడి పెట్టడం తగదన్నారు. సామాజిక న్యాయం, పేదల ప్రభుత్వము అనిఒక వైపు ఢంకా బజాయిస్తూ మరో వైపు పేదలు, బలహీనవర్గాలకుచెందిన కార్మికుల వేతనాలు నిలిపివేస్తామనడం దారుణమన్నారు. వేతనాలు నిలిపివేసే అధికారం ప్రభుత్వానికి, అధికారులకు లేదన్నారు. ప్రజలను భయభ్రాంతులను చేసి పనుులు వసూలు చేయటం నిరంకుశత్వం కాదా? అనిబాబూరావు ప్రశిుంచారు. ఈ అమానుష చర్యలకు ముఖ్యమంత్రి బాధ్యత వహించాలని, వైసిపి ప్రజాప్రతినిధులు మౌనం వీడాలన్నారు.