Aug 19,2022 11:47

ప్రజాశక్తి - తిరుమల : సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఎన్వీ రమణ కుటుంబ సమేతంగా శుక్రవారం తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. ఆలయం ఎదుట చైర్మన్‌ వైవి సుబ్బారెడ్డి , ఉప ముఖ్యమంత్రి నారాయణ స్వామి జస్టిస్‌ రమణకు స్వాగతం పలికారు. స్వామివారి దర్శనం అనంతరం జస్టిస్‌ ఎన్వీ రమణ దంపతులకు రంగనాయకుల మండపంలో వేద ఆశీర్వచనం అందజేసి ప్రసాదాలు అందించారు. స్వామివారిని దర్శిచుకున్న వారిలో తెలంగాణ హై కోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఉజ్జల్‌ భుయన్‌, టిటిడి ఈవో ఎవిధర్మారెడ్డి , సీవీఎస్వో నరసింహ కిషోర్‌,ఆలయ డిప్యూటీ ఈవో రమేష్‌ బాబు పాల్గొన్నారు.