
ప్రజాశక్తి-అమరావతి : సీఎం జగన్ తిరుపతి పర్యటను బయల్దేరారు. తిరుమల బ్రహ్మౌత్సవాల్లో భాగంగా స్వామివారికి ప్రభుత్వం తరపున పట్టు వస్త్రాలు సమర్పిస్తారు. అంతకు ముందు పలు ప్రారంభోత్సవాల్లో పాల్గొంటారు. శ్రీనివాస సేతు ప్రారంభిస్తారు. అనంతరం ఎస్‌వీ ఆర్ట్స్ కాలేజ్ హాస్టల్ బిల్డింగ్ వర్చువల్ ప్రారంభోత్సవం, టీటీడీ ఉద్యోగులకు ఇళ్ళ పట్టాల పంపిణీ కార్యక్రమంలో పాల్గొంటారు. అక్కడి నుంచి తాతయ్యగుంట గంగమ్మ ఆలయానికి చేరుకుని దర్శించుకుంటారు. అనంతరం తిరుమల చేరుకుని వకుళామాత రెస్ట్ హౌస్, రచన రెస్ట్ హౌస్‌లు ప్రారంభిస్తారు. ఆ తర్వాత బేడీ ఆంజనేయ స్వామిని దర్శించుకుని అక్కడి నుంచి శ్రీ వేంకటేశ్వర స్వామి వారికి పట్టువస్త్రాలు సమర్పించేందుకు ప్రధాన ఆలయానికి చేరుకుంటారు. తిరుమలలో సాయంత్రం 6.15-6.30 గంటల మధ్య మీన లగంలో ధ్వజారోహణం నిర్వహిస్తారు. రాత్రి 9 గంటలకు పెద్ద శేషవాహనంపై శ్రీదేవి, భూదేవి సమేత మలయప్పస్వామి ఊరేగనున్నారు.