Sep 18,2023 20:12

ప్రజాశక్తి-తిరుమల : తిరుమల సాలకట్ల బ్రహ్మౌత్సవాల్లో భాగంగా.. ఏపీ ప్రభుత్వం తరుపున స్వామి వారికి పట్టువస్త్రాలను సిఎం జగన్‌మోహన్‌రెడ్డి సమర్పించారు. ఈ కార్యక్రమంలో టీటీడీ చైర్మన్‌ భూమన కరుణాకర్‌ రెడ్డి, డిప్యూటీ సీఎంలు నారాయణ స్వామి, కొట్టు సత్యనారాయణ, మంత్రులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఆదిమూలపు సురేష్‌, మాజీ మంత్రి కొడాలి నాని తదితరులు పాల్గొన్నారు.