
ఆదోని (కర్నూలు) : కాసేపట్లో ఎపి రాష్ట్రంలో ఒకటి నుంచి పదో తరగతి చదువుతున్న విద్యార్థులకు మూడో విడత జగనన్న విద్యాకానుక పంపిణీ కార్యక్రమం జరగనుంది. ఈ సందర్భంగా సోమవారం ఉదయం ఆదోని పట్టణానికి ముఖ్యమంత్రి జగన్మోహనరెడ్డి చేరుకున్నారు. పట్టణంలోని ప్రభుత్వ ఆర్ట్స్ సైన్స్ కళాశాలలో ఏర్పాటు చేసిన హెలీప్యాడ్ కు 10:28 గంటలకు రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి చేరుకున్నారు. పట్టణంలోని మునిసిపల్ హైస్కూల్ ఆవరణంలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో రాష్ట్రంలో ఒకటి నుంచి పదో తరగతి చదువుతున్న విద్యార్థులకు మూడో విడత జగనన్న విద్యాకానుక పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించనున్నారు.
ప్రజాశక్తి-ఓర్వకల్లు : రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఓర్వకల్లులోని విమానాశ్రయానికి నేరుగా గన్నవరం విమానాశ్రయం నుండి ప్రత్యేక విమానంలో చేరుకున్నారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి జిల్లా కలెక్టర్ పి.కోటేశ్వరరావు, ఎమ్మెల్యేలు శిల్పా చక్రపాణి రెడ్డి, కాటసాని రాంభూపాల్ రెడ్డి , ఆర్థర్ డాక్టర్ సుధాకర్, కర్నూల్ నగర మేయర్ బివై.రామయ్య, తదితరులు ఘనంగా స్వాగతం పలికారు. ఈ సందర్భంగా సిఎం కొంతసేపు ప్రజాప్రతినిధులతో ముచ్చటించారు. అనంతరం ముఖ్యమంత్రి ఓర్వకల్లు విమానాశ్రయం నుండి నేరుగా ఆదోని కి ప్రత్యేక హెలికాప్టర్లో బయలుదేరి వెళ్లారు.