Jul 03,2022 09:49

ప్రజశక్తి - అమరావతి : రెండో కుమార్తె హర్షిణి రెడ్డిపై సిఎం జగన్‌ చేసిన ట్వీట్‌ ఇప్పుడు సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. ఎపి సిఎం జగన్‌ కుటుంబ సమేతంగా ప్రస్తుతం ప్యారిస్‌ పర్యటనలో ఉన్నారు. తన రెండో కుమార్తె హర్షిణి రెడ్డి ప్యారిస్‌లోని ఇన్సీడ్‌ యూనివర్సిటీ నుంచి మాస్టర్స్‌ డిగ్రీ పట్టా అందుకుంటున్న సందర్భంగా తమ కుమార్తె కాన్వకేషన్‌ కార్యక్రమంలో పాల్గొనేందుకు సిఎం జగన్‌ అక్కడికి వెళ్లారు. ఈ సందర్భంగా సిఎం జగన్‌ చేసిన ట్వీట్‌ ఇప్పుడు సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. 'నీవు ఇన్సీడ్‌ బిజినెస్‌ స్కూల్‌ నుంచి డిస్టింక్షన్‌లో గ్రాడ్యుయేషన్‌ పూర్తి చేయడంతోపాటు డీన్స్‌ జాబితాలోనూ చోటు సంపాదించినందుకు గర్వంగా ఉంది' 'అద్భుత ప్రయాణంలో నీ ఎదుగుదలను చూస్తున్నాం. నీకు దేవుడి శుభాశీస్సులు' అని ట్వీట్‌లో పేర్కొన్నారు. పట్టా తీసుకున్న కుమార్తెతో కలిసి ముఖ్యమంత్రి దంపతుల ఫొటోను సీఎం ట్వీట్‌ చేశారు.