May 22,2023 09:43

మచిలీపట్నం : నేడు సిఎం వైఎస్‌.జగన్‌ బందరు పోర్టు నిర్మాణ పనులను ప్రారంభించనున్నారు. సోమవారం ఉదయం కృష్ణాజిల్లా మచిలీపట్నం పర్యటనకు ముఖ్యమంత్రి బయలుదేరారు. మచిలీపట్నంలోని పోలీస్‌ పరేడ్‌ గ్రౌండ్‌లో ఏర్పాటుచేసిన హెలీప్యాడ్‌కు చేరుకున్నారు. అక్కడి నుంచి జిల్లా పరిషత్‌ సెంటర్‌లోని భారత్‌ స్కౌట్స్‌ అండ్‌ గైడ్స్‌ మైదానంలో ఏర్పాటుచేసిన బహిరంగసభ ప్రాంగణానికి చేరుకొని, బందరు పోర్టు నిర్మాణ ప్రదేశంలో భూమి పూజచేసి పైలాన్‌ను ఆవిష్కరించనున్నారు. తరువాత బహిరంగ సభలో ప్రసంగించనున్నారు. ఈ కార్యక్రమం అనంతరం సిఎం జగన్‌ మచిలీపట్నం నుంచి తాడేపల్లి నివాసానికి తిరుగు ప్రయాణమవుతారు.