
ప్రజాశక్తి-అమరావతి బ్యూరో :విజయవాడ రాఘవయ్య పార్కు సమీపంలోని మిషనరీస్ ఆఫ్ చారిటీ నిర్మల్ హృదయ్ భవన్‌ను సిఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి, ఆయన భార్య వైఎస్ భారతి దంపతులు మంగళవారం సందర్శించారు. మదర్ థెరిస్సా విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. నిర్మల్ హృదయ్ లో నూతనంగా నిర్మించిన హోమ్ ఫర్ సిక్ అండ్ డైయింగ్ డెస్టిట్యూట్స్ భవనాన్ని సిఎం ప్రారంభించారు. అనంతరం నిర్మల్ హృదయ్ లో వికలాంగులు, అనాధ పిల్లలు, వృద్ధులతో ముచ్చటించారు.