Jul 02,2022 12:49

ప్రజాశక్తి- చిలకలూరిపేట (గుంటూరు) : ఆర్‌టిసి బస్సు ఛార్జీల మోతకు నిరసనగా రాష్ట్ర వ్యాప్తంగా బస్‌స్టేషన్ల ముందు నిరసనలు, ధర్నాలు నిర్వహించాలని వామపక్షపార్టీలు పిలుపునిచ్చాయి. ఈ నేపథ్యంలో చిలకలూరిపేట బస్టాండ్‌ వద్ద సిపిఎం, సిపిఐ నాయకులు ధర్నా చేశారు. పెంచిన చార్జీలను వెంటనే రద్దు చేయాలని పెద్ద పెట్టున్న నినాదాలు చేశారు. ఇప్పటికే నిత్యావసర వస్తువులు, ఇతర ధరలు విపరీతంగా పెరిగి సామాన్య, మధ్యతరగతి ప్రజల జీవితాలు అతలాకుతలమవుతుంటే ప్రజలకు ఉపశమనం కలిగించాల్సిందిపోయి బస్‌ ఛార్జీలు పెంచడం గోరుచుట్టుపై రోకటి పోటవుతుందని పేర్కొన్నారు. పెంచిన బస్‌ఛార్జీల నిర్ణయాన్ని తక్షణం ఉపసహరించుకోవాలని డిమాండ్‌ చేశారు.