Sep 18,2023 10:34

గుత్తి (అనంతపురం) : సిపిఎం సీనియర్‌ నాయకులు రామచంద్ర రెడ్డికి పార్టీ నేతలు సోమవారం నివాళులర్పించారు. గుత్తి మండలం సిపిఎం సీనియర్‌ నాయకులు బసినేపల్లి మాజీ సర్పంచ్‌, గుత్తి మండల ప్రజల కోసం ఎన్నో పోరాటాలు చేసిన ప్రజా నాయకుడు మొదటి నుంచి చివరివరకు ఎర్రజెండాలో ఒదిగిన రామచంద్ర రెడ్డికి సిపిఎం నేతలు నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో సిపిఎం జిల్లా కార్యదర్శి రాంభూపాల్‌, సిఐటియు రాష్ట్ర నాయకులు ఓబులు, మండల నాయకులు పాల్గొన్నారు.