
అద్భుతమైన చారిత్రక కట్టడాలకు, ప్రాచీన శిల్ప సంపదకు ప్రసిద్ధి కంబోడియా. సున్నపురాతితో చెక్కిన నిర్మాణాలు, కోటలు ప్రధాన ఆకర్షణ. ఇది ఆగేయాసియాలోని ఇండోచైనా ద్వీపకల్పానికి దక్షిణ భాగంలోని ఓ చిన్న దేశం. దీనికి సరిహద్దులుగా వియత్నాం, థాయిలాండ్, లావోస్ దేశాలు ఉన్నాయి. దేశ ఆర్థిక వ్యవస్థలో పర్యాటకం రంగం అత్యంత ముఖ్యమైనది. అనేక చారిత్రక కట్టడాలు, కోటలు వంటి నిర్మాణాలు పర్యాటకులకు ప్రధాన ఆకర్షణ. ఇక్కడి పర్యావరణ జీవవైవిధ్యానికి ప్రతీకగా నిలుస్తుంది. ఖైమర్ పాలనలో కో కెర్ అత్యంత ముఖ్యమైన స్థావరాలలో ఒకటి. నాల్గో జయవర్మన్, రెండో హర్షవర్మన్ పాలనలో ఇది కొంతకాలం ఖైమర్ సామ్రాజ్యానికి రాజధానిగా పనిచేసింది. 1992 నుంచి కో కెర్ యునెస్కో తాత్కాలిక ప్రపంచ వారసత్వ జాబితాలో భాగంగా ఉంది.





