
ఇంటర్నెట్‌డెస్క్ : తాను సాయంత్రం 6 గంటలకే భోజనం చేసి.. రాత్రి 9.30గంటకల్లా నిద్రపోతానని ప్రముఖ బాలీవుడ్ నటి అనుష్కశర్మ సోషల్‌మీడియా వేదికగా వెల్లడించారు. తన సహ నటులు కత్రినా, విక్కీ దంపతులు ఆ సమయానికి స్నాక్స్ తీసుకుంటే.. తాను మాత్రం ఆ సమయానికి భోజనం పూర్తిచేస్తానని అనుష్క అన్నారు. ఇక బాలీవుడ్ నటుడు అక్షరు కుమార్ కూడా రాత్రిపూట త్వరగా భోజనం పూర్తి చేస్తారట. రాత్రిపూట త్వరగా భోజనం పూర్తి చేయడం వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాల గురించి వైద్యులు ఏమంటున్నారంటే..?!
ప్రయోజనాలు
రాత్రి 10 గంటలకు ముందే భోజనం ముగించడం వల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలున్నాయని పలు పరిశోధనల్లో తేలిందని వైద్యులు అంటున్నారు.
- ఉదయం వేళల్లో జీవక్రియ వేగంగా ఉంటుంది. పగటి సమయలో ఏ ఆహారం తీసుకున్నా త్వరగా జీర్ణమవుతుంది. అదే రాత్రి సమయంలో జీవక్రియ మందగిస్తుంది. అందుకే వైద్యులు రాత్రిపూట త్వరగా భోజనం పూర్తి చేస్తే అరుగుదల సమస్యలు తలెత్తవని వైద్యులు సూచిస్తున్నారు.