Aug 06,2022 21:51

ప్రజాశక్తి-న్యూఢిల్లీ బ్యూరో :ఆజాదీ కా అమృత్‌ మహోత్సవ్‌ నేషనల్‌ కమిటీ సమావేశంలో టిడిపి అధినేత, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పాల్గన్నారు. రాష్ట్రపతి భవన్‌లో ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ అధ్యక్షతన కమిటీ సమావేశం శనివారం జరిగింది. ఈ కమిటీలో 241 మంది సభ్యులు ఉన్నారు.
రాష్ట్రపతిని కలిసిన చంద్రబాబు బృందం
రాష్ట్రపతి భవన్‌లో రాష్ట్రపతి ద్రౌపది ముర్మును చంద్రబాబు బృందం కలిసి శుభాకాంక్షలు తెలిపింది. ఈ సందర్భంగా ఆమెకు చంద్రబాబు పుష్పగుచ్ఛం అందజేశారు. చంద్రబాబు వెంట టిడిపి ఎంపిలు గల్లా జయదేవ్‌, కె రామ్మోహన్‌నాయుడు, కేశినేని నాని, కనకమేడల రవీంద్ర కుమార్‌, పిఎసి ఛైర్మన్‌ పయ్యావుల కేశవ్‌, మాజీ మంత్రి కె అచ్చెన్నాయుడు, ఎమ్మెల్సీ గుమ్మడి సంధ్యారాణి, రాజ్యసభ మాజీ సభ్యులు కె రామ్మోహన్‌రావు, టిడిపి పొలిట్‌బ్యూరో సభ్యులు ఆర్‌ శ్రీనివాసరెడ్డి తదితరులు ఉన్నారు.