May 23,2023 21:19

ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : రాష్ట్రంలోకి రాకూడదని సిబిఐని కట్టడి చేస్తూ జిఓలు ఇచ్చిన చంద్రబాబు.. అవినాష్‌రెడ్డి కేసులో సిబిఐకి అనుకూలంగా మాట్లాడటం హాస్యాస్పదమని ఎమ్మెల్యే పేర్ని నాని విమర్శించారు. అధికారంలో వున్నపుడు సిబిఐ రాష్ట్రంలోకి రాకుండా ఏకంగా 176 జిఓను తెచ్చిన చంద్రబాబుకు సిబిఐ పేరు ఎత్తే అర్హత కూడా లేదని పేర్కొన్నారు. తాడేపల్లిలోని వైసిపి కేంద్ర కార్యాలయంలో మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడారు. గుండెజబ్బు వచ్చిన తల్లి కోసం ఎంపి అవినాష్‌రెడ్డి విచారణను వాయిదా కోరుతూ వెసులుబాటు అడగటం కూడా తప్పు అనేలా వ్యవహరించడం తగదన్నారు. చంద్రబాబు ఎన్నిసార్లయినా బెయిల్‌ తెచుకోవచ్చు గానీ అవినాష్‌రెడ్డి బెయిల్‌ అడిగితే మాత్రం తప్పా? అని ప్రశ్నించారు.