May 29,2023 19:39

వర్షం కారణంగా 15 ఓవర్లలో 171 పరుగుల లక్ష్యాన్ని విధించగా.. సీఎస్‌కే నిర్ణీత 15 ఓవర్లలో ఐదు వికెట్లు కోల్పోయి టార్గెట్‌ను అందుకుంది. ఆఖరి ఓవర్లో 13 పరుగులు అవసరమైన దశలో జడేజా ఆఖరి రెండు బంతుల్లో సిక్సర్‌, ఫోర్‌ కొట్టి సీఎస్‌కేను గెలిపించాడు. అంతకముందు ఓపెనర్లు రుతురాజ్‌ 26, డెవాన్‌ కాన్వే 47 ఆరంభాన్ని ఇచ్చారు. ఆ తర్వాత శివమ్‌ దూబే 32 నాటౌట్‌, రహానే 27 పరుగులతో కీలక ఇన్నింగ్స్‌ ఆడాడు. ఇక చివర్లో జడేజా ఆరు బంతుల్లో 16 పరుగులు నాటౌట్‌ తన విలువేంటో మరోసారి చాటిచెబుతూ సీఎస్‌కేను ఐదోసారి చాంపియన్‌గా నిలిపాడు. ఈ విజయంతో ఐదోసారి టైటిల్‌ అందుకున్నసీఎస్‌కే ముంబై ఇండియన్స్‌తో కలిసి సమంగా నిలిచింది.

గుజరాత్‌ ఇన్నింగ్స్‌: సాహా (సి) ధోని (బి) దీపక్‌ చాహర్‌ 54; శుభ్‌మన్‌ (స్టంప్డ్‌) ధోని (బి) జడేజా 39; సాయి సుదర్శన్‌ ఎల్బీ (బి) పతిరన 96; హార్దిక్‌ నాటౌట్‌ 21; రషీద్‌ (సి) రుతురాజ్‌ (బి) పతిరన 0; ఎక్స్‌ట్రాలు 4 మొత్తం: (20 ఓవర్లలో 4 వికెట్లకు) 214; వికెట్ల పతనం: 1-67, 2-131, 3-212, 4-214; బౌలింగ్‌: దీపక్‌ చాహర్‌ 4-0-38-1; తుషార్‌ దేశ్‌పాండే 4-0-56-0; తీక్షణ 4-0-36-0; జడేజా 4-0-38-1; పతిరన 4-0-44-2
చెన్నై ఇన్నింగ్స్‌: రుతురాజ్‌ (సి) రషీద్‌ (బి) నూర్‌ అహ్మద్‌ 26; కాన్వే (సి) మోహిత్‌ (బి) నూర్‌ అహ్మద్‌ 47; దూబె నాటౌట్‌ 32; రహానె (సి) శంకర్‌ (బి) మోహిత్‌ 27; రాయుడు (సి) అండ్‌ (బి) మోహిత్‌ 19; ధోని (సి) మిల్లర్‌ (బి) మోహిత్‌ 0; జడేజా నాటౌట్‌ 15; ఎక్స్‌ట్రాలు 5 మొత్తం: (15 ఓవర్లలో 5 వికెట్లకు) 171; వికెట్ల పతనం: 1-74, 2-78, 3-117, 4-149, 5-149; బౌలింగ్‌: షమి 3-0-29-0; హార్దిక్‌ 1-0-14-0; రషీద్‌ఖాన్‌ 3-0-44-0; నూర్‌ అహ్మద్‌ 3-0-17-2; లిటిల్‌ 2-0-30-0; మోహిత్‌శర్మ 3-0-36-3

 

  • మ్యాచ్‌కు వర్షం అంతరాయం

గుజరాత్‌ టైటాన్స్‌, సీఎస్‌కే మధ్య ఫైనల్‌మ్యాచ్‌కు వర్షం మరోసారి అంతరాయం కలిగించింది. సీఎస్‌కే ఇన్నింగ్స్‌ ప్రారంభమైన తొలి ఓవర్లో నాలుగు బంతులు పడగానే వర్షం మొదలైంది. ప్రస్తుతం సీఎస్‌కే వికెట్‌ నష్టపోకుండా 4 పరుగులు చేసింది.

  •  సాయి సుదర్శన్‌ ధనాధన్‌ ఇన్నింగ్స్‌.. గుజరాత్‌ 214/4

చెన్నై సూపర్‌ కింగ్స్‌తో అహ్మదాబాద్‌ వేదికగా జరుగుతున్న ఐపీఎల్‌ - 16 ఫైనల్స్‌ లో గుజరాత్‌ టైటాన్స్‌ 214 పరుగులు చేసింది. వన్‌ డౌన్‌ బ్యాటర్‌ సాయి సుదర్శన్‌ (47 బంతుల్లో 96, 8 ఫోర్లు, 6 సిక్సర్లు) చేలరేగి ఆడాడు. ఓపెనర్‌ వృద్ధిమాన్‌ సాహా (39 బంతుల్లో 54, 5 ఫోర్లు, 1 సిక్సర్‌), శుభ్మన్‌ గిల్‌ (20 బంతుల్లో 39, 7 ఫోర్లు), హార్ధిక్‌ పాండ్యా (12 బంతుల్లో 21, 2 సిక్సర్లు) రాణించారు. తొలి వికెట్‌ కు గిల్‌ - సాహాలు 67 పరుగులు జోడించారు. రెండో వికెట్‌ కు సాహా - సుదర్శన్‌ లు 64 రన్స్‌ జోడించారు. ఇక చివర్లో హార్ధిక్‌ పాండ్యాతో కలిసి సుదర్శన్‌ 81 పరుగులు జోడించాడు. దీంతో గుజరాత్‌.. నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 214 పరుగులు చేసింది. చెన్నై బౌలర్లలో పతిరాన 2, జడేజా, చాహర్‌లు తలా ఒక వికెట్‌ తీశారు.

 

  • 18 ఓవర్లలో గుజరాత్‌ టైటాన్స్‌ 182/2

18 ఓవర్లలో రెండు వికెట్ల నష్టానికి 182 పరుగులు చేసింది. సాయి సుదర్శన్‌ 79, పాండ్యా 8 పరుగుతో క్రీజులో ఉన్నారు.

  • :17 ఓవర్‌లో 6,4,4,4

తుషార్‌ దేశ్‌పాండే వేసిన 17వ ఓవర్‌లో సాయి సుదర్శన్‌ వరుసగా 6,4,4,4 కొట్టాడు. దీంతో ఈ ఓవర్‌లో మొత్తం 20 పరుగులు వచ్చాయి. సాయి సుదర్శన్‌ 73 పరుగుల మీద బ్యాటింగ్‌ చేస్తున్నాడు. గుజరాత్‌ 17 ఓవర్లు ముగిసే సరికి 2 వికెట్ల నష్టనికి 173 పరుగులు చేసింది.

 

  •  సాయి సుదర్శన్‌ 50

గుజరాత్‌ వన్‌డౌన్‌ బ్యాట్స్‌మెన్‌ సాయి సుదర్శన్‌ 50 పరుగుల మార్క్‌ను అందుకున్నాడు. సాయి సుదర్శన్‌ 35 బంతుల్లో 57 పరుగులు చేశాడు. అతని ఇన్నింగ్స్‌లో 4 ఫోర్లు, 3 సిక్స్‌లు ఉన్నాయి. గుజరాత్‌ 16 ఓవర్లు ముగిసే సరికి 2 వికెట్ల నష్టనికి 153 పరుగులు చేసింది.

  • సాహా ఔట్‌.. గుజరాత్‌ 131/2

39 బంతుల్లో 54 పరుగుల చేసిన గుజరాత్‌ ఓపెనర్‌ వృద్ధిమాన్‌ సాహా దీపక్‌ చాహర్‌ బౌలింగ్‌లో కీపర్‌ ధోనికి క్యాచ్‌ ఇచ్చి పెవలియన్‌కు చేరాడు. సాహా 39 బంతుల్లో 5 ఫోర్లు 1 సిక్స్‌ సాయంతో 54 పరుగులు చేశాడు. 14 ఓవర్లు పూర్తయ్యే సరికి గుజరాత్‌ 2 వికెట్ల నష్టానికి 131 పరుగులు చేసింది.

 

  • వృద్ధిమాన్‌ సాహా 50.. గుజరాత్‌ 124/1

గుజరాత్‌ ఓపెనర్‌ వృద్ధిమాన్‌ సాహా 50 పరుగులు మార్క్‌ను అందుకున్నాడు. సాహా 37 బంతుల్లో 5 ఫోర్లు 1 సిక్స్‌ సాయంతో 50 పరుగులు పూర్తి చేశాడు. గుజరాత్‌ ప్రస్తుతానికి 13 ఓవర్లు ముగిసే సరికి వికెట్‌ నష్టానికి 124 పరుగులు చేసింది.

  • 11 ఓవర్లు పూర్తి.. గుజరాత్‌ 96/1

11 ఓవర్లు ముగిసే సరికి గుజరాత్‌ జట్టు 96 పరుగులు చేసింది. వృద్ధిమాన్‌ సాహా 34 బంతుల్లో 47 పరుగులు చేయగా వన్‌డౌన్‌ బ్యాటర్‌ సాయి సుదర్శన్‌ 12 బంతుల్లో 10 పరుగులు చేశాడు.

  • 9 ఓవర్లకు 80

9 ఓవర్లు ముగిసే సరికి గుజరాత్‌ జట్టు వికెట్‌ నష్టానికి 90 పరుగులు చేసింది. వృద్ధిమాన్‌ సాహా 28 బంతుల్లో 37 పరుగులు చేయగా వన్‌డౌన్‌ బ్యాటర్‌ సాయి సుదర్శన్‌ 6 బంతుల్లో 4 పరుగులు చేశాడు.

  • గిల్‌ స్టంపౌట్‌

రవీంద్ర జడేజా బౌలింగ్‌ గుజరాత్‌ బ్యాటర్‌ శుభమాన్‌ గిల్‌ స్టంపౌట్‌గా పెవిలియన్‌కు చేరాడు. గిల్‌ 20 బంతుల్లో 39 పరుగులు చేశాడు. గిల్‌ ఇన్నింగ్స్‌లో 7 ఫోర్లు ఉన్నాయి. గుజరాత్‌ జట్టు 67 పరుగులు చేసింది.

  • పవర్‌ ప్లే పూర్తి.. గుజరాత్‌ 62/0

పవర్‌ ప్లే ముగిసే సరికి గుజరాత్‌ జట్టు 62 పరుగులు చేసింది. వృద్ధిమాన్‌ సాహా 19 బంతుల్లో 26, శుభమాన్‌ గిల్‌ 17 బంతుల్లో 36 పరుగుల మీద బ్యాటింగ్‌ చేస్తున్నారు. మరో వైపు చైన్నై బౌలర్లు వీరిని ఔట్‌ చేయడానికి తీవ్రంగా కృషి చేస్తున్నారు.

 

  • 4 ఓవర్‌లో హ్యట్రిక్‌ ఫోర్స్‌.. గుజరాత్‌ 38/0

తుషార్‌ దేశ్‌పాండే వేసిన 4వ ఓవర్‌లో శుభమాన్‌గిల్‌ హ్యట్రిక్‌ ఫోర్స్‌ కొట్టాడు. కాగా 4 ఓవర్లు ముగిసే సరికి గుజరాత్‌ 38 పరుగులు చేసింది. వృద్ధిమాన్‌ సాహా 14 బంతుల్లో 21, శుభమాన్‌ గిల్‌ 10 బంతుల్లో 17 పరుగులతో ఆడుతున్నారు.

2 ఓవర్లుకు 8

2 ఓవర్లు ముగిసే సరికి గుజరాత్‌ జట్టు 8 పరుగులు చేసింది. వృద్ధిమాన్‌ సాహా 7 బంతుల్లో 4, శుభమాన్‌ గిల్‌ 5 బంతుల్లో 4 పరుగులతో ఆడుతున్నారు.

  • టాస్‌ గెలిచిన చెన్నై.. తొలుత బౌలింగ్‌

ఐపీఎల్‌ 16వ సీజన్‌లో భాగంగా చెన్నై సుపర్‌కింగ్స్‌, గుజరాత్‌ టైటాన్స్‌ మధ్య ఆదివారం జరగాల్సిన ఫైనల్‌ మ్యాచ్‌ వర్షం కారణంగా సోమవారానికి వాయిదా పడిన సంగతి తెలిసిందే. కాగా ఈరోజు మ్యాచ్‌లో టాస్‌ గెలిచిన సీఎస్‌కే బౌలింగ్‌ ఎంచుకుంది.


గుజరాత్‌ టైటాన్స్‌ (ప్లేయింగ్‌): వృద్ధిమాన్‌ సాహా(వికెట్‌ కీపర్‌), శుభమాన్‌ గిల్‌, సాయి సుదర్శన్‌, హార్దిక్‌ పాండ్యా(కెప్టెన్‌), విజరు శంకర్‌, డేవిడ్‌ మిల్లర్‌, రాహుల్‌ తెవాటియా, రషీద్‌ ఖాన్‌, మోహిత్‌ శర్మ, నూర్‌ అహ్మద్‌, మహమ్మద్‌ షమీ

చెన్నై సూపర్‌ కింగ్స్‌ (ప్లేయింగ్‌): రుతురాజ్‌ గైక్వాడ్‌, డెవాన్‌ కాన్వే, అజింక్యా రహానే, మొయిన్‌ అలీ, అంబటి రాయుడు, రవీంద్ర జడేజా, ఎంఎస్‌ ధోని(వికెట్‌ కీపర్‌/కెప్టెన్‌), దీపక్‌ చాహర్‌, వరుతీషా పతిరణ, తుషార్‌ దేశ్‌పాండే, మహేశ్‌ తీక్షణ